సుప్రీంకోర్టు తదుపరి ఉన్నత న్యాయమూర్తిగా సీనియర్ జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును..ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సిఫార్సు చేశారు. దీంతో తదుపరి సీజేగా సంజీవ్ ఖన్నానే నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జస్టిస్ చంద్రచూడ్ సిఫార్సుకు కేంద్రం ఆమోదం తెలిపితే..సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్ ఖన్నా నియమితులవుతారు.నవంబర్ 11న జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పదవీ విరమణ పొందనున్న విషయం తెలిసిందే. ఆయన పదవీ కాలం దగ్గర పడటంతో సంజీవ్ ఖన్నా పేరును తదుపరి చీఫ్ జస్టిస్‌గా కేంద్రానికి ప్రపోజ్ చేశారు.
ఇక కేంద్రం ఆమోదించడమే తదుపరి.అదే జరిగితే నవంబర్ 12న సంజీవ్ ఖన్నా సీజేగా బాధ్యతలు తీసుకుంటారు.సుప్రీంకోర్టు సీజేఐ రూల్స్ ప్రకారం ప్రకారం..కొత్త సీజేఐ పేరును లేఖ ద్వారా కేంద్ర న్యాయశాఖకు పంపుతారు.అక్కడి నుంచి ప్రధానమంత్రి పరిశీలనకు వెళ్తుంది.ఆ తర్వాత రాష్ట్రపతికి చేరుకుని..చివరిగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరిస్తారు.ఆ పదవిలో ఉన్న సీజేఐ కొత్త సీజే పేరును సిఫార్సు చేయడం అనవాయితీగా వస్తోంది.