బూంబూం బీర్, ప్రెసిడెంట్ మెడల్ తెచ్చింది చంద్రబాబే – జగన్‌

-

బూంబూం బీర్లపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బూంబూం బీర్, ప్రెసిడెంట్ మెడల్ తెచ్చింది చంద్రబాబే అంటూ బాంబ్‌ పేల్చారు జగన్‌. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా కొన్ని బ్రాండ్లు రిలీజ్ చేసి వెళ్ళారని ఆరోపణలు చేశారు. 14-5-2019లో బూమ్ బూమ్ బీర్, అవే డిస్తలరీ లు బ్రాండ్లు మారతాయన్నారు. చంద్రబాబు సమయంలో ఇచ్చిన మధ్యమే మా హయంలో వచ్చిందని వెల్లడించారు.

jagan comments on boom boom beers

బడ్జెట్ ప్రవేశ పెడితే సూపర్-6 ఎక్కడ అని ప్రజలు అడుగుతారని భయం బాబును వెంటాడుతుందని అన్నారు. వైసీపీ హయాంలో మాదిరి.. బాబు అయిదు నెలల్లో డీబీటీ ఎక్కడా కనిపించలేదని పేర్కొన్నారు. ఇసుక, మద్యం, ఎక్కడ చూసినా దోపిడియే. కప్పం కట్టనిదే పనులు జరగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దోచుకో పంచుకో తినుకో మాఫియా నడుస్తోంది. చంద్రబాబు అబద్దాలకు రెక్కలు కట్టాడని తెలిపారు.  రూ. 10 వేలు జీతమని చెప్పి వాలంటీర్లను మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ఇసుకపై చాలా ప్రచారం చేశారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news