సూర్య కొత్త మూవీ “రోలెక్స్”.. అతనే డైరెక్టర్..!

-

కమల్ హాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్’ చిత్రంలో సూర్య పోషించిన ‘రోలెక్స్’ పాత్ర ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే. దీంతో ఆ పాత్రనే లీడ్ రోల్ గా చేసి ఓ సినిమా ప్లాన్ చేసినట్టు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పటికే ప్రకటించాడు. అది మొదలు.. ఎప్పుడెప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉండబోతోందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.  ప్రస్తుతం ‘కంగువ’ చిత్రం ప్రమోషన్స్ తో  బిజీగా ఉన్నాడు సూర్య. ఈ ప్రమోషన్స్ ‘రోలెక్స్’ మూవీ గురించి సూర్య కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

1986లో ‘విడుదలైన ‘విక్రమ్’ సినిమాతో 2022లో వచ్చిన ‘విక్రమ్’కు ఎలా కనెక్షన్ ఉందో.. అదే . .
విధంగా ‘రోలెక్స్’ చిత్రానికి కూడా తాను గతంలో నటించిన ఓ సినిమాకు లింక్ ఉంటుందని సూర్య చెప్పాడు. దీంతో ఆ సినిమా ఏమై ఉంటుందా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక శివ
దర్శకత్వంలో సూర్య నటించిన ‘కంగువ’ చిత్రం నవంబర్ 14న పాన్ ఇండియా మూవీ గా విడుదల కానుంది. ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news