తెలంగాణలో దాదాపు 150 మంది ఏఈవోలపై సస్పెన్షన్ వేటు..!

-

డిజిటల్ క్రాఫ్ సర్వే ను వ్యతిరేకిస్తున్న ఏఈవో లను ప్రభుత్వం క్రమశిక్షణ చర్యల పేరుతో తన దారికి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా 150 మందికి పైగా ఏఈవో లపై సస్పెన్షన్ వేటు వేసినట్లుగా సమాచారం. యూనియన్లు పెట్టినా, ప్రభుత్వం చెప్పిన పని చేయడానికి నిరాకరించిన వేటు తప్పదంటూ ప్రభుత్వం తన చర్యల ద్వారా హెచ్చరించింది. డిజిటల్ క్రాఫ్ సర్వే చేయకపోతే ఉద్యోగాలు ఉండవన్న తీరుగా ప్రభుత్వం చర్యలున్నాయని ఏఈవోలు మండిపడుతున్నారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లపై ప్రభుత్వం వేధింపులను ఆపాలని, సస్పెన్షలను ఎత్తివేసి చర్చల ద్వారా తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏఈవోలు శంషాబాద్ లో సమావేశమై డిజిటల్ క్రాఫ్ సర్వే చేయబోమని, తగిన భద్రతను, సహాయకులను అందిస్తేనే అందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏఈవో లపై చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది. వ్యవసాయ రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సృష్టించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రి మిషన్ పథకాన్ని తీసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news