భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు.. కష్టాల్లో టీమిండియా!

-

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా మరోసారి పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. తొలి టెస్టు ఓటమితో ఇప్పటికే నిరాశలో ఉన్న జట్టు.. రెండో టెస్టులో ఏకంగా ముగ్గురు ప్లేయర్ల మార్పులతో రంగంలోకి దిగింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టర్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆ జట్టును కుప్పకూల్చాడు. తొలి రోజే న్యూజిలాండ్ జట్టును కట్టడి చేయడంతో ఈ మ్యాచులో భారత్ గెలుపు ఖాయం అనుకున్నారు ఫ్యాన్స్.

రెండో ఇన్నింగ్స్ ఆట ప్రారంభం నుంచే టీమిండియా తడబడింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే రెండు వికెట్లను కోల్పోయింది. నిన్న రోహిత్ 0 (డకౌట్)గా వెనుదిరగగా.. ఈ రోజు ఉదయం శుభమన్ గిల్ (30), విరాట్ కోహ్లీ (1) నిరాశపరిచాడు. దీంతో 56 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం జైస్వాల్ (26), పంత్ (4) క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 203 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం భారత స్కోర్ 61/3గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news