ఫోన్ టాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాలు..!

-

రేవంత్ రెడ్డి సొంతమంత్రులతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను టాప్ చేస్తున్నారు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే ఫోన్ టాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాలు విసిరారు. దమ్ముంటే కెమెరాల ముందు ఈ అంశంలో లై డిటెక్టర్ పరీక్షకు రావాలి. రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా సవాలు స్వీకరించి బహిరంగంగా ఫోన్ ట్యాప్ చేయడం లేదని ప్రకటించాలి . తెలంగాణ రాష్ట్రంలో మంత్రులతో పాటు నా ఫోన్ టైపింగ్ చేయట్లేదని చెప్పాలి.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతల ఫోన్ లను కూడా ట్యాప్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలి అన్నారు.

రేవంత్ రెడ్డి ఫోన్ టాపింగ్ విషయంలో నాతోపాటు బహిరంగంగా కెమెరాల ముందు లై డిటెక్టర్ పరీక్షకు రావాలి. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి అవే నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. 50 లక్షల రూపాయల బ్యాగుతో పట్టుబడిన రేవంత్ రెడ్డిని దొంగ అనకుంటే ఏమంటారు. డబ్బుల కట్టలతో సభ్యులను కొనాలనుకున్న రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాల్సి వచ్చింది . రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 100 రోజుల్లోనే అనేక హామీలను నెరవేరుస్తామంటూ చెప్పి ఆరు గ్యారెంటీలు కాదు హాఫ్ గ్యారెంటీలు మాదిరి అయిపోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news