తిరుపతి వెళ్లొచ్చేలోపు ఇంటిని కూల్చిన అధికారులు.. ఎక్కడంటే?

-

హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝలిపిస్తున్న విషయం తెలిసిందే. రాత్రికి రాత్రే హైడ్రా అధికారులు రంగ ప్రవేశం చేస్తున్నారు. ఉదయం కూల్చివేతల ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. అయితే, మూసాపేట పరిధిలోని బాలాజీ నగర్ కాలనీలో తాళం వేసిన ఇంటిని అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటి యాజమానులు తిరుపతి దర్శనం కోసం వెళ్లొచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బాలాజీ నగర్ కాలనీలో ఉండే కటిక నిరుపమ రాణి, వారి కుటుంబ సభ్యుల కలిసి తిరుపతి వెళ్లి వచ్చే సరికే అధికారులు అక్రమ నిర్మాణం అంటూ ఇంటిని కూల్చివేశారు.కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని, ఇంట్లో సామగ్రి మొత్తం ధ్వంసం అయ్యిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news