మట్టి మోపిస్తున్నారు,గడ్డి పీకిస్తున్నారు : బెటాలియన్ పోలీసుల ఆవేదన

-

రాష్ట్రంలోని బెటాలియన్ కానిస్టేబుళ్ల గోస మాములుగా లేదు. వారు అనుభవిస్తున్న బాధలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. దీంతో నెటిజన్లు వారి గోడును విని ప్రభుత్వంపై విరచుకపడుతున్నారు. సోసైటీ రక్షణలో పోలీసులు కీలక పాత్ర వహిస్తారు. అలాంటి వారితో ఇలా ఉన్నతాధికారులు తన వ్యక్తిగత పనులు, వెట్టిచాకిరీ చేయించడంపై ప్రభుత్వం త్వరగా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తమకు ఓకే పోలీసు విధానం అమలు చేయాలని బెటాలియన్ పోలీసులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే వీరి బాధలను వినేందుకు ఓ ఉన్నతాధికారి ముందుకు రావడంతో బెటాలియన్ కానిస్టేబుళ్లు అంతా ఒక చోట చేరి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఓ కానిస్టేబుల్ మాట్లాడుతూ.. బెటాలియన్ కానిస్టేబుళ్లతో మట్టి మోపిస్తున్నారు..గడ్డి పీకిస్తున్నారు. కూలీల లాగా మమ్మల్ని చూస్తున్నారు. రెండు నెలలకు ఒకసారి మా పోస్టింగ్‌లు మారుస్తున్నారు. దీని మీద ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా శనివారం తమకు మద్దతిస్తూ మాట్లాడారు.
మాకు 5 ఏండ్ల వరకు ఒకే దగర పోస్టింగ్ ఇవ్వాలి. ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని ఓ కానిస్టేబుల్ ఉన్నతాధికారికి చెప్పగా.. ఆయన నోట్ చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news