మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడ్ని వెంటనే అరెస్టు చేయాలని హోమంత్రి ఆదేశించారు హోంమంత్రి అనిత. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడడం హేయమన్న హోం మంత్రి అని ఫైర్ అయ్యారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేయడం పోలీసుల పనితీరుకు నిదర్శనం అన్నారు వంగల పూడి అనిత.
చిన్నారి హత్యాచారంపై చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. తిరుపతి జిల్లా వడమాల పేట చిన్నారి హత్యాచారం పై విచారం వ్యక్తం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. వడమాల పేట మండలం ఎఎంపురం గ్రామ చిన్నారి హత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలుపుతూ రూ.10 లక్షలను బాధిత కుటుంబానికి అందచేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.