ప్రముఖ కన్నడ డైరెక్టర్ ఆత్మహత్య

-

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు గురు ప్రసాద్  ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరు లోని తన ఇంట్లో ఉరేసుకుని కనిపించారు. అయితే, డెడ్ బాడీ
ని చూస్తే ఆయన గత మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇతను  సూసైడ్ చేసుకోవడానికి  గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అసలు దర్శకుడు
గురు ప్రసాద్ మాత, ఇడ్డెలా మంజునాథ, రంగనాయక సినిమాలకు దర్శకత్వం వహించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును సైతం సొంత చేసుకున్నారు. బాడీగార్డ్,
కుష్క, విజిల్, హుడుగురు, మైలారీ, జిగర్తాండ మూవీల్లో చక్కని నటనతో ఆయన అందరినీ
ఆకట్టు కున్నారు. ఆయన నివాసం నుంచి దుర్వాసన వెదజల్లడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. మదనాయకనహళ్లి పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా
ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. మఠం గురుప్రసాద్ మొదట గిరినగర్ నివసించారు. 8 నెలల క్రితం బెంగళూరు నార్త్ తాలూకా మదనాయకనహళ్లిలోని టాటా న్యూ హెవెన్ అపార్ట్మెంట్ కి వెళ్లాడు. కొన్ని నెలల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news