మీ పెదాలు నల్లగా ఉన్నాయా..? ఇలా చేస్తే గులాబీ రంగులోకి మారిపోతాయి..!

-

అందంగా ఉండాలంటే నవ్వు బాగుండాలి. నవ్వు బాగుండాలంటే పెదవులు బాగుండాలి. కొంతమంది పెదవులు నల్లగా మారిపోతూ ఉంటాయి. మీ పెదాలు కూడా నల్లగా ఉన్నాయా..? అయితే ఇలా చేయండి. ఇలా చేయడం వలన పెదవులు అందంగా గులాబీ రంగులోకి వస్తాయి. మరి నల్లటి పెదాలని ఎలా తొలగించుకోవచ్చు..? అందమైన పెదాలని పొందాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడే చూద్దాం. చాలామంది మగవాళ్ళు స్మోకింగ్ చేస్తూ ఉంటారు. స్మోకింగ్ కారణంగా పెదవులు నల్లగా మారిపోతూ ఉంటాయి.

విటమిన్స్, ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ముఖ్యం. క్యారెట్స్, ఆకుకూరలు, టమాటాలు వంటి వాటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాటిని తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. పెదాలు కూడా బాగుంటాయి. గ్లిజరిన్ లో కొద్దిగా షుగర్ మిక్స్ చేసి పెదాలను స్క్రబ్ చేయండి. ఇలా చేస్తే కూడా మంచి ఫలితం కనబడుతుంది.

పింక్ కలర్ లోకి లిప్స్ వచ్చేస్తాయి. రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసి తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. వారం రోజులు ఇలా చేయడం వలన పెదాలలో మార్పు మీరు గమనించొచ్చు. పెదాలు మృదువుగా మారిపోతాయి కూడా. బీట్రూట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బీట్రూట్ పెదాలకి అందాన్ని ఇస్తాయి. మృదువుగా పెదాలని మారుస్తాయి. బీట్రూట్ రసంలో కొంచెం నెయ్యి కలిపి అలోవెరా జెల్ కూడా వేసి లిప్ మాస్క్ ని తయారు చేసుకోండి రాత్రి నిద్ర పోయేటప్పుడు పెదాలకి దీనిని అప్లై చేయడం వలన పెదాలు మృదువుగా మారుతాయి. గులాబీ రంగులోకి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news