భారత ప్రధాని మోడీ అధ్యక్షతన రేపు (బుధవారం) కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 10:30 గంటలకు జరుగనున్న ఈ కేంద్ర కేబినెట్ మీటింగులో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశముంది. అలాగే పలు ప్రాజెక్టులు, అభివద్ధి పథకాలకు కేంద్ర కేబినెట్ నిధులు మంజూరుపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం.అదేవిధంగా ఈ నెలలో జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో ఇస్తున్న హామీల మేరకు కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఉండవచ్చని భావిస్తున్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ , జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా వంటి అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశముండగా.. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నందున వాటికి ప్యాకేజీ లేదా కేంద్ర పథకాల్లో మెజార్టీ వాటా ఇవ్వనున్నట్లు కథనాలు వస్తున్నాయి.