సమగ్ర కుటుంబ సర్వే ను ప్రారంభించిన మంత్రి పొన్నం

-

సమగ్ర కుటుంబ సర్వే ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమానికి మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ , హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, GHMC అధికారులు..హాజరయ్యారు. ఎన్యుమరేటర్లకు సర్వే కిట్ అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.. అనంతరం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందన్నారు.

Minister Ponnam Prabhakar launched a comprehensive family survey

150 ఇండ్లకు ఒక ఎన్యుమరెటర్ సర్వే వివరాలు తీసుకుంటున్నారని తెలిపారు. మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కెర్ అంటిస్తారని వెల్లడించారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లకు వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఈ సర్వే కు పబ్లిక్ సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి 17 లక్షల 44 వేల ఇళ్లు ఉన్నాయని… సర్వే కోసం 87 వేల 900 ఎన్యుమరెటర్లు నియమించామని తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 28 లక్షల ఇండ్లు ఉండగా 19 వేలకు పైగా ఎన్యుమరేటర్లు నియమించామని పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా వచ్చే డేటా తో అన్ని వర్గాల వారికి భవిష్యత్ లో న్యాయం జరిగేలా చేస్తామని… కొందరు ఈ సర్వే ను రాజకీయం చేయాలని చూస్తున్నారని వివరించారు. అందరి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే సర్వే ప్రశ్నలు తయారు చేశామని… ఆధార్ కార్డు వివరాలు ఆప్షనల్ మాత్రమేనని తెలిపారు. ఎలాంటి పత్రాల జిరాక్సులు ఇవ్వాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు పొన్నం.

Read more RELATED
Recommended to you

Latest news