బ్రేక్ ఫాస్ట్ లో ఏం తీసుకుంటారనే దాని మీద మీ ఆరోగ్యం ఎలా ఉంటుందనేది డిపెండ్ అయ్యి ఉంటుందని మీకు తెలుసా..? మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే అనవసరమైన అనారోగ్యాలు చుట్టుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందుకే కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. అయితే బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందో, ఎక్కువకాలం జీవించవచ్చో తెలుసుకుందాం.
ప్రోటీన్ కలిగిన ఆహారాలు:
ప్రోటీన్ అనేది శరీరానికి చాలా అవసరం. ప్రోటీన్ తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. గుడ్లు, గింజలు, చికెన్ వంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే మంచిది. ఒకవేళ వెజ్ తినేవారు అయితే టమాటా పాలకూర.. మొదలగు వాటిని తీసుకుంటే శరీరానికి చక్కని ఫైబర్ అందుతుంది.
మంచి కొవ్వులు:
కొవ్వులు అనగానే అందరూ భయపడిపోతారు. గుండె సంబంధ సమస్యలు వస్తాయని వాటికి దూరంగా ఉంటారు. కొవ్వుల్లో మంచి కొవ్వులు కూడా ఉంటాయని చాలామందికి తెలియదు. అవకాడో, ఆలివ్ ఆయిల్.. వంటి వాటిల్లో మంచి కొవ్వు ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల అటు గుండె, ఇటు మెదడు ఆరోగ్యకరంగా మారుతుంది. బ్రేక్ ఫాస్ట్ లో అవకాడో యాడ్ చేసుకుంటే మంచిది.
తృణధాన్యాలు:
చక్కెర ఎక్కువగా ఉండే దాన్యాలను పక్కన పెట్టేసి తక్కువగా ఉండే తృణధాన్యాలను బ్రేక్ ఫాస్ట్ లో యాడ్ చేసుకోవడం మంచిది. ఓట్స్ ఇందులో ప్రధానమైనది. వీటిని తీసుకోవడం వల్ల గుండె సంబంధ సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరం:
కేక్, సాండ్విచ్, బర్గర్, వంటి బేకరీ ఐటమ్స్ తీసుకోవడం మానేయండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చి ఆయుష్షు తగ్గుతుంది. అలాంటి ఆహారాలను బ్రేక్ ఫాస్ట్ లో అస్సలు యాడ్ చేసుకోకూడదు.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.