అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రపంచదేశాలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి. డెమోక్రాట్స్ ఈ ఎన్నికల్లో డీలా పడగా..రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్స్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. అయితే, ఇరు పార్టీల మధ్య ఓట్ల శాతం, ఎలక్టోరల్ ఓట్లలో స్వల్ప తేడా మాత్రమే కనిపిస్తోంది. మొదటి నుంచి కమలా హ్యారిస్ తొలుత వెనకబడగా..కాలిఫోర్నియా ఫలితంతో ఆమెకు భారీ ఊరట లభించింది.
దేశంలో అత్యధిక ఎలక్టోరల్ ఓట్లున్న కాలిఫోర్నియా (54)లో కమలా విజయం సాధించారు. ఇక్కడి సెనెట్,ప్రతినిధుల సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గోల్డెన్ స్టేట్‌గా పేరొందిన కాలిఫోర్నియాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక రాష్ట్రంగా భావిస్తారు.ఇక్కడ కమలా హారిస్ గెలుస్తారని సర్వేలు ముందుగానే అంచనా వేశాయి. ఇక్కడ రిపబ్లికన్ల కంటే డెమోక్రట్ల ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. కాగా, 1988 నుంచి అధ్యక్ష ఎన్నికల్లో ఏ రిపబ్లికన్ అభ్యర్థీ కాలిఫోర్నియాలో విజయం సాధించకపోవడం గమనార్హం.