తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫాం స్కాం బాధితుల ఆందోళన

-

సాధారణంగా గాడిద పాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్న గ్లాసులో నాలుగు లేదా 5 స్పూన్ల పాలకే 100 నుంచి 150 వరకు వసూలు చేస్తుంటారు. లీటర్ల కొద్ది పాలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలా డిమాండ్ ఉండటం వల్లనే తెలుగు రాష్ట్రాల్లో గాడిద స్కామ్ జరిగింది. దీంతో బాధితులు ఆందోళన చేపడుతున్నారు.

గాడిదల ఫాం ఏర్పాటు చేస్తే కోట్లు వస్తాయని నమ్మించారు. ఒక్కొక్కరు 60 లక్షల నుంచి 90 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. తమిళనాడు తిరువన్ వేలికి చెందిన కొంతమంది మాకు ఈ బిజినెస్ గురించి చెప్పారు. మొదట్లో మేము ఇచ్చిన డబ్బులు పాలు కొన్నారు. తరువాత గాడిద పాలు మా దగ్గర కొనుగోలు చేయలేదు. ఇప్పటి వరకు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వటం లేదు.. 80 నుంచి 100 కోట్ల స్కాం జరిగింది. వాళ్ళు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మాకు న్యాయం చేయాలని  గాడిద స్కాం బాధితులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news