అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన కమలాహ్యారీస్ అనుహ్యంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో దాదాపు ఆమె గెలుపు ఖాయమైనట్లే అని అన్ని సర్వేలు కుండబద్దలు గొట్టాయి. తీరా చూస్తే ట్రంప్ అత్యధిక మెజార్టీతో గెలిచి అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక ట్రంప్‌కు 292 ఎలక్టోరోల్ ఓట్లు వస్తే.. కమలా హ్యారీస్‌కు 224 ఓట్లు మాత్రమే వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 270. కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఫలితాలు తేలలేదు. ఇకపోతే కమలాహ్యరీస్ ఓటమితో ఆమె అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి రోదనలు మిన్నంటాయి. ఆమె గెలిచి ఉంటే తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించేవారని వెక్కి వెక్కి ఏడుస్తున్న దృష్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.