కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ BSNL మరో సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికే 4G నెట్ వర్క్ కోసం ప్రయత్నాలు ప్రారంభించిన ఆ సంస్థ.. తక్కువ ధరకే క్వాలిటీ సేవలు అందించేందుకు కసరత్తులు చేస్తోంది. అందుకోసం దేశవ్యాప్తంగా 50వేల కొత్త 4జీ టవర్లను వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు టారిఫ్ చార్జిలు పెంచడంతో రెండు నెలల వ్యవధిలోనే లక్షలాది మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్లో చేరారు.
తాజాగా ‘సిమ్’ లేకుండానే కాల్స్, మెసేజ్‌లు చేసేలా కొత్త టెక్నాలజీని BSNL తయారు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ కొత్త టెక్నాలజీతో ఫోన్లో సిమ్ లేకపోయినా నెట్ వర్క్ లేకపోయినా కాల్స్ చేయవచ్చు. విపత్తులు, మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్నా, అటవీ ప్రాంతంలో తప్పిపోయినా శాటిలైట్ సాయంతో ఈ సేవలు అందుతాయని తెలుస్తోంది. ఈ డైరెక్ట్ టూ డివేజ్ టెక్నాలజీ కోసం అమెరికాకు చెందిన వయాశాత్ తో కలిసి దీనిని పరీక్షిస్తున్నట్లు BSNLతెలిపింది. శాటిలైట్, ప్రాంతీయ మొబైల్ నెట్ వర్క్‌లను లింక్ చేయడం ద్వారా ఇది పనిచేయనుంది.