అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచిన విషయం తెలిసిందే. ట్రంప్ విజయానికి ప్రస్తుత డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షడు బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్ ప్రభుత్వ వైఫల్యాలు, విధానపరమైన నిర్ణయాలే కారణమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ కీలక వ్యాఖ్యలు చేశారు.
బైడెన్ హయాంలో భారత్‌తో అమెరికా బంధం బలపడిందని చెప్పుకొచ్చారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామన్నారు. జపాన్‌కు తలుపు తట్టామని, డిఫెన్స్ రంగంలో వారి పెట్టుబడులు మరింత రెట్టింపు అయ్యాయని తెలిపారు. నాటోను మరింత బలపరిచామని, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ దేశాలకు మద్దతు ఇస్తూనే 50 దేశాల భద్రతపై ఫోకస్ చేశామన్నారు. ఏయూకేయూఎస్‌కు చాలా సామర్థ్యం ఉందన్నారు.