హైదరాబాద్ వాసులకు అలర్ట్..డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. అర్ధరాత్రి జూబ్లీహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పబ్బుల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు….కొంతమందిపై కేసులు కూడా నమోదు చేసారు. రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేసేందుకు పబ్ ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ తరుణంలోనే నిన్న 12 పబ్బుల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు అధికారులు. తాగి వాహనం నడిపిన వారితో పాటు రాష్ డ్రైవింగ్ లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. వీకెండ్ రోజుల్లో తప్పనిసరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని ట్రాఫిక్ అదనపు సిపి విశ్వ ప్రసాద్ ప్రకటించారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు ట్రాఫిక్ అదనపు సిపి విశ్వ ప్రసాద్.