వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల పై కడప పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి తో సహా మరికొందరి పై లుకౌట్ పోలీసులు జారీ చేసారు. ఈనెల 08న పులివెందుల లో వర్రా రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఏపీలో భార్గవ్ రెడ్డి పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. విదేశాలకు పారపోతారనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ముఖ్యంగా భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించారు. సజ్జల భార్గవ్ రెడ్డి పై వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు తీసుకున్నాక మరింత రెచ్చిపోయారు. జడ్జీలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడని.. అతడే బెదిరించాడు. 2023 నుంచి నా ఫేస్ బుక్ ఐడీతో పోస్టులు పెట్టావారని అరెస్ట్ అయిన రవీందర్ రెడ్డి వెల్లడించారు.