కేసీఆర్ కు ప్రజల బాధ కాదు.. ప్రభుత్వం లేదనే బాధ : శ్రీధర్ బాబు

-

కేసీఆర్, హరీష్ రావులకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. అయితే తాజాగా మళ్ళీ BRS ప్రభుత్వం వస్తుంది అంటూ మాట్లాడిన KCR ప్రజలు బాధ పడుతున్నాఉ అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్ పై స్పదించిన శ్రీధర్ బాబు.. జనం ఏం బాధ పడటం లేదు. నా ప్రభుత్వం లేదనే బాధలో కేసీఆర్ ఉన్నాడు అని పేర్కొన్నారు. అలాగే 50 వేల ఉద్యోగాలు ఇవ్వడం తప్పా.. ఉచిత బస్సు తప్పా.. 18 వేల కోట్ల పై చిలుకు రుణాలు మాఫీ చేయడం తప్పా అని KCR ని ప్రశ్నించారు.

ఇక కలెక్టర్ పై దాడి ఘటనలో హరీష్ కి కౌంటర్ ఇస్తూ.. రాళ్ళు వేసింది ఎవరు.. పిచ్చొల్లు ఎవరు అనేది విచారణలో తేలుతుంది అని పేర్కొన్నారు. అలాగే రాళ్ళు ఎవరి చేతులకు ఇస్తున్నారు మీరు.. అధికారులను కొట్టే వరకు వెళ్లారు. హరీష్ కు ఈ రకమైన మాటలు తగవు అని శ్రీధర్ బాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news