హైదరాబాద్‌లో ఈనెల 21 నుంచి 24 వరకు హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో లోకమంథన్ కార్యక్రమం జరుగుతుంది కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.ఈ ఏడాది మన నగరంలో లోక్ మంథన్ జరగడం సంతోషంగా ఉందన్నారు. శుక్రవారం బేగంపేట పర్యాటక భవన్‌లో లోక్ మంథన్ పై కేంద్రమంత్రి ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంగా లోక్‌మంథన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ లోక్‌మంథన్ కార్యక్రమంలో కవులు, కళాకారులు, విదేశీ అతిథులు పాల్గొంటారని వివరించారు. ఈ నెల 21న స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని,ఈ నెల 22న లోక్‌మంథన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ముర్ము ఈనెల 21న హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అదే రోజుల సాయంత్రం ఎన్డీఆర్ మైదానంలో జరిగే కోటి దిపోత్సవం కార్యక్రమానికి హాజరవుతారు.