ఏపీ డీఎస్సీలో వయో పరిమితి పెంపు…మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన !

-

ఏపీ డీఎస్సీలో వయో పరిమితి పెంపుపై…మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికలకు రెండు నెలల ముందు గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని… డీఎస్సీలో వయో పరిమితి పెంచడం పై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్. వచ్చే విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి డీఎస్సీ పూర్తి చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. కమిషనర్… ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అవుతున్నారన్నారు మంత్రి నారా లోకేష్.

ఉపాధ్యాయులకు మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు…. విద్యపైన మాత్రమే దృష్టి పెట్టేలా మేం ప్రణాళిక వేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన కేసులు త్వరలో ఎత్తివేస్తామని తెలిపారు మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్యే లు తమ నియోజకవర్గంలో అందరూ ప్రతీ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాలని కోరారు మంత్రి నారా లోకేష్. తగరపువలస డిగ్రీ కాలేజీ కి కూడా ప్రత్యామ్నాయం సిద్ధం చేస్తామని… సింహాచలం స్కూలు మిగిలి ఉన్న పనులు త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news