కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రోడ్లు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు.గాంధీభవన్‌లో వీరు మీడియాతో మాట్లాడుతూ..బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు. పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ..లగచర్ల దాడి ఘటన చూసిన అనంతరం ప్రతిపక్షం చేసిన పనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్తిరపరుచాలని చూస్తున్నారన్నారు.లగచర్ల ఘటనలో కేసీఆర్, కేటీఆర్ ఎవ్వరూ ఉన్నా చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం కుల గణన చేపడుతుందని గుర్తు చేశారు.