ప్రేమికుల విషయంలో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రేమలో ఉన్న వాళ్లు కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ‘టీనేజ్ ప్రేమలో కౌగిలింతలు, ముద్దులు నేరంగా పరిగణించబడవు అంటూ ఒక వ్యక్తిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిపై నేరారోపణలను కొట్టివేసింది మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్. టీనేజ్ ప్రేమను నేరంగా పరిగణించరాదని పేర్కొంది. ఏకాంత ప్రాంతంలో జరిగిన సమావేశంలో తనను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడని తన ప్రియుడిపై 19 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది.
ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది IPC యొక్క సెక్షన్ 354-A(1)(i) ప్రకారం FIRకి దారి తీసింది. అయితే.. ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రేమలో ఉన్న వాళ్లు కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఓ కుర్రాడిని విడిచిపెట్టాలని ఆదేశించింది.