మాటలు ప్రజలకు.. మూటలు పార్టీకి.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

-

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు చెప్పారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా సికింద్రాబాద్ టూరిజం ప్లాజాలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెబుతూ మహారాష్ట్ర ప్రజలను కూడా మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. మాటలు ప్రజలకు.. మూటలు పార్టీకి అన్నట్టు రేవంత్ రెడ్డి తీరు ఉందన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే రేవంత్ పాలన కొనసాగుతొందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండానే నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. నిరుద్యోగులు ఇంకా నోటిఫికేషన్ల కోసం అశోక్ నగర్ లైబ్రరీ వద్ద ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ వైఫల్యం చెందిందన్నారు. రైతులు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. తాను రేపు  రాత్రి మూసీ నది ఒడ్డునే బస చేసి అక్కడే పడుకుంటానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news