సౌందర్యాలంకరణ రంగంలో ఉన్న వారి కోసం కేంద్రం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఆ పథకం పేరు ది ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ షిప్ ప్లాట్ ఫాం. నీతి అయోగ్ ఆధ్వర్యంలో ఇది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నడిచే ఓ వేదిక. అర్బన్ కంపెనీ భాగస్వామ్యంతో ఇవాళ పైలెట్ ప్రాజెక్ట్ ను ప్రకటించారు.
బ్యూటీషియన్లు, ఆరోగ్య పరిరక్షణ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ పథకం ద్వారా చేయూతనివ్వనున్నారు. ఈ పథకం ద్వారా బ్యూటీషియన్లు, తదితరులు తమ వ్యాపారాలను మెరుగుపర్చుకునేందుకు తోడ్పాటును అందించనున్నారు. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కోసం 25 మందిని ఎంపిక చేయనున్నారు. స్కిల్లింగ్, లీగల్, కాంప్లయన్స్, ఫైనాన్షియల్ యాక్సెస్, మార్కెట్, బిజినెస్ డెవలప్ మెంట్ సర్వీసుల్లో ఆ మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.