రోడ్డు ప్రమాదాలకు సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒక్కటే కాదు.. రోడ్డు దాటే క్రమంలో వచ్చిపోయే వాహనాలను చూడకుండా ఫోన్ చూస్తూ క్రాస్ చేయడం కూడా మరో కారణం. ఈ కారనణాల వల్లే ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. తాజాగా ఓ యువతి రోడ్డును గమనించకుండా రోడ్డు దాటే క్రమంలో ఓ కారు వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె గాల్లో ఎగిరి ఆమడ దూరంలో పడిపోయింది.
దీంతో కంగారు పడిన కారు డ్రైవర్ వెంటనే కిందకు దిగి ఆమెకు ఏమైందోనని ఆరా తీయడం మొదలెట్టాడు. ఇంతలో ఆ డ్రైవర్‌కు యువతి షాక్ ఇచ్చింది. తనకు ఏమైందోనని పట్టించుకోకుండా ఆ యువతి వెంటనే తన ఫోన్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అతనికి షాకింగ్‌గా అనిపించింది. ఈ ఘటన సింగపూర్‌లో దేశంలో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్డు దాటే క్రమంలో ఫోన్ యూజ్ చేయవద్దని పలువురు హెచ్చరిస్తున్నారు.
కారు ఢీకొడితే తన సంగతి వదిలేసి సెల్‌ఫోన్ చెక్ చేసుకున్న యువతి
సింగపూర్‌లో ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటిన యువతి.. హఠాత్తుగా వచ్చి ఢీకొన్న కారు
యువతికి ఏమైందోనని కంగారుగా కారు దిగి వచ్చిన డ్రైవర్
పైకి లేచి తన గాయాలు చూసుకోకుండా ఫోన్ పాడైందేమోనని చూసుకున్న యువతి… pic.twitter.com/R1km7m7IF6
— BIG TV Breaking News (@bigtvtelugu) November 15, 2024