బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో కులగణన సర్వే..

-

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే(కులగణన) ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది. ప్రతిపక్షాలు సైతం ఈ సర్వేను ఆహ్వానించాయి. అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు, నేతలు తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఈనెల 30తో ఈ కులగణన సర్వే పూర్తి కానుంది.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఇంటికి కులగణన ఎన్యూమరేటర్లు వెళ్లగా వారికి ఆమె పూర్తిగా సహకరించారు. శనివారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్‌లో గల కవిత ఇంటికి కులగణన అధికారులు వెళ్లగా..ఆమె కులగణనలో తమ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయించారు. ఆ సమయంలో కవిత భర్త కూడా ఆమె పక్కనే ఉండి అధికారులకు వివరాలు తెలిపారు. కాగా, కులగణన సర్వేలో 70కు పైగా ప్రశ్నలు అడుగుతుండగా.. ఆ సంఖ్యను తగ్గించాలని, వ్యక్తిగత వివరాలు అడుగరాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news