జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ కి అరుదైన పురస్కారం

-

త్రిపుర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అత్యధిక కేసులు పరిష్కరించిన న్యాయమూర్తిగా ఆయన రికార్డు నమోదు చేసుకున్నారు. ఇందుకు ఆయన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. అదేవిధంగా యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. 2017 నుంచి ఇప్పటివరకు జస్టిస్ అమరనాథ్ దాదాపు 92వేల కేసులు పరిష్కరించారు.

Amarnath Goud
Amarnath Goud

హైదరాబాద్ వాసి అయిన అమర్ నాథ్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే 2017లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జస్టిస్ అమర్ నాథ్ మాట్లాడుతూ తన బెంచ్  లో కేసులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తానని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news