పలమనేరులో ఒంటరి మహిళలను హడలెత్తిస్తున్న చైన్స్ స్నాచింగ్ ముఠాలు అరెస్ట్ అయ్యాయి.స్నాచింగ్ టీం లీడర్ చంద్రశేఖర్ తో పాటు 6 మంది సభ్యులు అరెస్ట్ చేసిన పోలీసులు.. పుంగునూరు కి చెందిన మరో సింగల్ చైన్ స్నాచర్ ప్రసాద్ అరెస్ట్ అయ్యాడు. 24 లక్షల 75 వేల విలువైన 330 గ్రాముల బంగారం నాలుగు బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. బైకుపై ఇద్దరు వ్యక్తులు రావడం వెనకున్న వ్యక్తి చేను లాక్కుని వెళ్ళే విధంగా పక్క ప్లాన్ చేశారు.
అయితే పలమనేరు సబ్ డివిజన్లోని ఐదు మండలాలలో మహిళల బంగారాన్ని దోచుకెళ్తున్న ముఠా.. రెండు సంవత్సరాలుగా వరుస దోపిడీలకు పాల్పడుతుంది. గ్యాంగ్ సభ్యులందరూ తాపీ మేస్త్రీ పనులతో జీవనం సాగించే వ్యక్తులుగా గుర్తించిన పోలీసులు.. ఒంటరిగా బైకుపై వెళ్తూ మహిళల మెడలో గొలుసులు కాజేస్తున్నారు. పలు కంపెనీ లోన్ యాప్ ల ద్వారా అప్పుల పాలై గొలుసుల దొంగగా మారాడు ప్రసాద్ నాయక్. రెండు సంవత్సరాలుగా చిక్కని గొలుసు దొంగల ముఠాలను అరెస్ట్ చేశామన్నారు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు.