రేపటి నుండి ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమలు : మంత్రి పొన్నం

-

హైదరాబాదును కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ కాలుష్యం రాకుండా ఉండేందుకు ఈవి పాలసీ తీసుకొచ్చాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో 2020-2030 ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకొచ్చారు. జీవో నెంబర్ 41 ద్వారా 2026 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. రేపటి నుండి ఈ జీవో ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమలులోకి వస్తుంది. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి లేదు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మార్చాలని ప్రణాళికలు తెచ్చాం. ఎలక్ట్రిక్ 4 వీలర్స్ ,2 వీలార్స్, ఎలక్ట్రిక్ కమెరిష్యల్ వెహికిల్, ట్రై గూడ్స్ వెహికిల్, ఎలక్ట్రిక్ వెహికిల్ టాక్స్ లు మినహాయింపు ఉంది.

ఎలక్ట్రిక్ బస్సులు కొన్నట్లైతే, కార్లు ఆర్టీసీ బస్సులు, సంస్థల బస్సులు 100 శాతం టాక్స్ మినహాయింపు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ లో 83 పఠాన్ చేరు 72 కాలుష్యం ఉంది. కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవి పై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. హైదరాబాద్ లో ఇప్పుడున్న 3 వేల బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని నిర్ణయించాం. త్వరలోనే సిటీలో మొత్తం ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు పరిమితి సంఖ్యలోనే ఎలక్ట్రిక్ వాహనాల వాడుతున్నారు. 2026 డిసెంబర్ 31 వరకు ఈవీ పాలసీ ఉంటుంది. హైదరాబాద్ జీహెచ్ ఎంసీ మాత్రమే కాకుండా తెలంగాణ మొత్తం ఈవి పాలసీ ఉంటుంది. తెలంగాణ ప్రజలను కోరుతున్నా ఈవి వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వండి. భవిష్యత్ తరాలకు కాలుష్యం నుండి నివారించండి అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news