కొమురం భీమ్ జిల్లా కెరామెరి మండలంలో గల జోడెఘాట్‌లో పెద్ద పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. రాత్రిళ్లు ఇళ్ల ముందు కట్టి వేసి ఉంచిన పశువులపై పెద్దపుల్లి పంజా విసురుతోంది. ఇప్పటకే రెండు పశువులను చంపి తిన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. మహరాష్ట్ర నుంచి ఈ పులి కొమురం భీం జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చినట్లు అటవీ అధికారులు గుర్తించారు.
పెద్దపులి సంచరిస్తున్న జోడెఘాట్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. రాత్రుళ్లు ఒంటరిగా బయటకు వెళ్లరాదని, పశువులను సైతం త్వరగా ఇళ్లకు చేర్చాలని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, పెద్దపులిని పట్టుకుని దూరంగా విడిచిపెట్టాలని గ్రామస్తులు ఫారెస్టు అధికారులను కోరుతున్నారు.
కొమురం భీమ్ జిల్లా కెరమెరి మండలం జోడెఘాట్ లో పులి సంచారం…
పశువుల పై పంజావిసురుతున్నా పులి.
రెండు పశువులను చంపిన పులి.
మహరాష్ట్ర నుండి ఈ పులి వచ్చిందంటున్న అటవీ అధికారులు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. pic.twitter.com/yDDOKiWO4D— ChotaNews (@ChotaNewsTelugu) November 18, 2024