వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఘటన పై ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే దాదాపు 17 మందిని అరెస్ట్ చేసింది. వీరిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేంధర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత సురేష్ కూడా ఉన్నారు. పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్డి పై కూడా వేటు పడింది. ఆయనను డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. అతని స్థానంలో కొత్త డీఎస్పీ గా శ్రీనివాస్ నియమితులయ్యారు.
లగచర్ల ఘటనలో గ్రామస్థులను, రైతులను రెచ్చగొట్టింది సురేష్ కాదు ఒక ప్రభుత్వ ఉద్యోగి అని స్పష్టమైంది. వాస్తవానికి లగచర్ల గ్రామస్థులను, రైతులను రాఘవేందర్ అనే పంచాయితీ సెక్రటరీ రెచ్చగొట్టినట్లు గుర్తించారు. అధికారులపై దాడికి సిద్దంగా ఉండాలని ప్రేరేపించారు రాఘవేందర్. వికారాబాద్ జిల్లా సంగయ్యపల్లిలో పని చేస్తున్నారు రాఘవేందర్. రాఘవేందర్ ను ఇప్పటికే సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు పంచాయితీ సెక్రెటరీ రాఘవేందర్.