AP: పాడిరైతులకు శుభవార్త.. విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని పాడిరైతులకు శుభవార్త అందింది.. విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంచారు అధికారులు. పాల సేకరణ ధరను పెంచాలని కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) నిర్ణయం తీసుకోవడం జరిగింది. 10% వెన్న కలిగిన లీటర్ గేదె పాలపై రూ.2, ఆవు పాలపై రూ.1.50 పెంచుతున్నట్లు ప్రకటన చేసింది కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ). దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని పాడిరైతులకు శుభవార్త అందింది..

Good news for dairy farmers Vijaya Dairy milk procurement price increase

ఇక కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) నిర్ణయం ప్రకటన తో రైతులకు లాభం జరుగనుంది. ప్రస్తుతం 10% వెన్న కలిగిన పాలకు రూ.80 చెల్లిస్తుండగా, రూ.2 పెంచడంతో రూ.82కి చేరిందని చెబుతున్నారు. యూనియన్‌లో ఉన్న పాడి రైతులకు 4 నెలలకు సంబంధించిన రెండో విడత బోనస్‌గా రూ.12 కోట్లను నేడు విడుదల చేయనున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) ప్రకటన చేసింది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news