చండీ ఆలయంలో నమాజ్ చేసిన వ్యక్తి.. పోలీసులకు అయ్యప్ప భక్తుల ఫిర్యాదు

-

హైదరాబాద్ మహానగరంలో కొందరు కావాలనే తమ కమ్యూనిటీని రెచ్చగొడుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనేది ప్రధాన ఆరోపణ.ఇటీవల సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తి ఆలయంలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.

తాజాగా అదే వర్గానికి చెందిన మరో వ్యక్తి నాగోల్‌లోని ధనలక్ష్మి నగర్‌లో గల చండీ అమ్మవారి ఆలయంలో అయ్యప్ప భక్తులు సన్నిధానం ఏర్పాటు చేసుకోగా.. మంగళవారం ఉదయం ఆలయంలోకి వచ్చి అక్కడ నమాజ్ చేశాడు. అక్కడే ఉన్న అయ్యప్ప భక్తులు తీవ్ర అభ్యంతరం చేశారు. ఓ స్వామి వెంట వచ్చిన సదరు ముస్లిం యువకుడు, మాల వేసుకున్న వ్యక్తి కూడా వేరే మతానికి చెందిన వారిగా అయ్యప్ప స్వాములు అనుమానం వ్యక్తం చేశారు. అయ్యప్ప భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.

Read more RELATED
Recommended to you

Latest news