లగచర్ల కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లగచర్ల వెళ్తున్న మహిళా సంఘాల నేతలను అడ్డుకున్నారు తెలంగాణ పోలీసులు. Pow సంధ్య నేతృత్వంలో మహిళా సంఘాల లగచర్ల పర్యటన కొనసాగుతోంది. అయితే.. లగచర్ల వెళ్తున్న మహిళా సంఘాల నేతలను అడ్డుకున్నారు తెలంగాణ పోలీసులు. బొమ్రాస్ పేట మండలం తుంకిమెట్ల వద్ద అడ్డుకున్నారు పోలీసులు.
దీంతో పోలీసులతో మహిళా సంఘాల నేతల వాగ్వాదం నెలకొంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక అటు రాష్ట్రపతి వద్దకు లగచర్ల పంచాయితీ చేరింది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం లగచర్ల బాధిత కుటుంబాలు.. ఎదురు చూస్తున్నాయి. ఢిల్లీలో లగచర్ల బాధిత కుటుంబాలు కోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. లగచర్లలో బలవంతపు భూ సేకరణ ఘటనను సంబంధించిన విషయాలను రాష్ట్రపతి కార్యాలయానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందజేశారు.