హోంమంత్రి అనిత పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత పై మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో హోంమంత్రి పై పోస్టులు పెట్టారని వైసీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టారని పేర్కొన్నారు. హోంమంత్రి అనిత కులం ఏంటో కూడా నాకు తెలియదని.. తాను బైబుల్ పట్టుకు తిరుగుతానని ఆమె చెప్పారని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టే సరికి ఆమె ఎస్సీ అయిపోయారని విమర్శించారు.

Ambati-Anitha
Ambati-Anitha

ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి పేర్కొన్నారు. పాపం హోంమంత్రి చేతిలో ఏముందని.. అంతా మంత్రి నారా లోకేశ్ చేస్తున్నారని ఆరోపించారు. మైకు ముందు మాత్రమే అనిత హోంమంత్రి అని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో పోస్టుల పేరుతో వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని పేర్కొన్నారు. మరి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేతలు, కార్యకర్తలు పెట్టిన పోస్టులపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు అంబటి రాంబాబు. తమపై అసభ్య పోస్టులు చేసిన వారిపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news