బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు మానుకోటలో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే…. రేపు మానుకోటలో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించనుంది.
లగచర్ల ఘటన , గిరిజన సమస్యలపై పోరాటం చేయనుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..హాజరు కానున్నారు. కాగా, లగచర్లలో అర్థరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండే కాదు.. పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా ??అంటూ కేటీఆర్ ఆగ్రహించారు. నిజనిర్ధారణకు వెళ్లిన వారిని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోంది ? వాస్తవాలను తొక్కిపెట్టాలని ఈ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తోంది ? అని మండిపడ్డారు.