హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.సిద్ధిక్ నగర్లో పునాదులు తవ్వేటప్పుడు ఐదు అంతస్థుల భవనం కుంగి ఓ వైపునకు ఒరగడంతో దాని కూల్చివేతకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. భవనం కూల్చివేతకు హైడ్రా బాహుబలి జాక్ క్రషర్‌ను సిద్ధం చేసింది. 50 గజాల్లో ఐదు అంతస్తుల్లో భవనం నిర్మించడంపై జీహెచ్ఎంసీ సీరియస్ అయ్యింది.
60శాతం పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు ఇంజనీరింగ్ నిపుణులు గుర్తించారు.సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్లు తవ్వడం వల్లే పక్కనే ఉన్న ఐదంతస్తుల భవనం ఒరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమాని సైతం పై కేసు నమోదు చేశారు. తొవ్విన సెల్లార్‌ను అధికారులు పూడ్చివేయించారు. ప్రస్తుతం ఒరిగిన భవనం కూల్చివేతకు సంబంధించిన పనులు జరుగుతుండగా.. భవన యాజమానులు ఆందోళన తెలుపుతున్నారు.
సిద్దిక్ నగర్లో భవనం కూల్చివేతకు జీహెచ్ఎంసీ నిర్ణయం
50 గజాల్లో ఐదు అంతస్తుల్లో భవనం నిర్మించడంపై జీహెచ్ఎంసీ సీరియస్
60 శాతం పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు గుర్తించిన ఇంజనీరింగ్ నిపుణులు
సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్లు తవ్వడం వల్లే పక్కనే ఉన్న ఐదంతస్తుల భవనం ఒరిగినట్లు నిర్ధారణ… https://t.co/szZ7t0TmuE
— BIG TV Breaking News (@bigtvtelugu) November 20, 2024