చైనా నుంచి తెగులు సోకిన వెల్లుల్లి.. 9,990 బస్తాలు సీజ్.. ఎక్కడంటే?

-

తెలుగు రాష్ట్రాల్లో కల్తీ ఫుడ్‌తో పాటు అందులో వినియోగించే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కూడా కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కల్తీ చేస్తున్నారు. కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో పాటు అల్లం లేకుండానే కొన్ని రసాయనాలు వాడి పేస్టును తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో పెద్దఎత్తున కుళ్లిపోయిన వెల్లుల్లితో తయారుచేసిన అల్లం పేస్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.

తాజాగా ఏపీలోని అమరావతిలో తెగులు సోకిన చైనా వెల్లుల్లిని అధికారులు సీజ్ చేశారు.చైనా నుంచి దిగుమతి అయిన తెగులు సోకిన వెల్లుల్లిని నెల్లూరు సమీపంలో కస్టమ్స్ అధికారులు పట్టుకోగా.. 9,990 కిలోల వెల్లుల్లి బస్తాలతో వెళ్తున్న వ్యాను లోడును స్వాధీనం చేసుకున్నారు.దాని విలువ రూ.21.97 లక్షల ఉంటుందని గుర్తించారు. మొత్తం 333 బస్తాల్లో తెగులు సోకిన వెల్లుల్లి ఉంది. కాగా, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం చైనా వెల్లుల్లిని దిగుమతి చేసుకోవడంపై నిషేధం కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news