సిగరెట్ తాగొద్దన్నందుకు పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. సిగరెట్ తాగొద్దని తండ్రి పలుమార్లు మందలించడంతో 6 నెలల క్రితం గడ్డి మందు తాగాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా చికిత్స తర్వాత 16 ఏళ్ల బాలుడు కోలుకున్నాడు.
అయితే, బాలుడు నార్మల్ అయ్యాక కూడా ఇదే విషయాన్ని పదేపదే ఫ్రెండ్స్ ప్రస్తావిస్తూ బాలుడిని ఆటపట్టించడం చేశాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన బాలుడు శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.