మహారాష్ట్ర దెబ్బకు.. తెలంగాణ ప్రభుత్వంలో ఏదైనా జరుగవచ్చు అంటూ బాంబ్ పేల్చారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. మహారాష్ట్ర లో ఎన్డీయే కూటమి విజయదుంధుబి మోగిస్తుందని… కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని రుజువు అయ్యిందని పేర్కొన్నారు. బిజేపి ఒంటరిగా 125 స్థానాలు గెలవబోతుందని… యూపి లో ఏడు స్థానాలలో ముందంజలో ఉందని వెల్లడించారు. ఎన్ని అబద్దాల ప్రచారం చేసిన ఎన్డీయే కూటమి నే మహారాష్ట్ర ప్రజలు నమ్మారని వివరించారు.
మహారాష్ట్ర ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణ లో ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. తెలంగాణ లో యుద్ధం ప్రారంభం అయ్యిందని తెలిపారు. ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అవుతాయని బాంబ్ పేల్చారు. ప్రభుత్వం కూలాలని మేము అనుకోవడం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులలో ప్రభుత్వం పై అసంతృప్తి ఉందన్నారు. కులగణన వివరాలు పెన్సిల్ తో నింపుతున్నారు.. వాటిని మార్చే అవకాశం ఉందని ఆరోపనలు చేశారు. కులగణనలో భయపెట్టి సర్వే చేస్తున్నారని వివరించారు.