Wayanad Bypoll Election results: వయనాడ్ ఎన్నికల ఫలితాల్లో ప్రియాంక గాంధీ రికార్డు సృష్టించారు. ఈ తరునంలోనే రాహుల్ గాంధీ మెజార్టీ బ్రేక్ చేశారు ప్రియాంక గాంధీ.. ప్రియాంకకు 3.68 లక్షల మెజార్టీ వచ్చింది.. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ రావడం జరిగింది. ప్రస్తుతం ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ ఉపఎన్నికలో 3 లక్షల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇది ఆమెకు తొలి ఎన్నికలు అన్న సంగతి తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్రకారం, భారత జాతీయ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న వాద్రా 461,566 ఓట్లను సాధించి, 3.68 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఆమె ప్రధాన పోటీదారులు, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్ వరుసగా వెనుకంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో ప్రియాంక గాంధీ సోదరుడు రాహుల్ గాంధీ వయనాడ్ లో ఎంపీగా గెలిచాడు. ఈ తరునంలోనే… పోలైన 9.52 లక్షల ఓట్లలో వాద్రాకు దాదాపు ఆరు లక్షల ఓట్లు వస్తాయని జిల్లా కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేస్తోంది. ఇదిలా ఉండగా, ఎల్‌డిఎఫ్‌కు చెందిన సత్యన్ మొకేరికి దాదాపు రెండు లక్షల ఓట్లు, బిజెపికి చెందిన హరిదాస్‌కు లక్ష ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.