KTR: దీక్షా దివస్‌కు జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్‌ల నియామకం చేశారు కేటీఆర్. ఈ నెల 29వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్..నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేటీఆర్.. ఈ సందర్బంగా మాట్లాడారు.
తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు మళ్లీ ఏర్పడ్డాయని వెల్లడించారు. ఆ రోజు తెలంగాణ కోసం దీక్ష చేస్తే… ఇప్పుడు కాంగ్రెస్ అరాచకాలపై మరోసారి దీక్షలు చేయాలని అనుకుంటున్నామన్నారు కేటీఆర్. నవంబర్ 29 నాడు 33 జిల్లాలో దీక్ష దివస్ చేయబోతున్నామని ప్రకటన చేశారు. ప్రతి జిల్లాలో సీనియర్ నాయకులు పాల్గొంటారన్నారు.
డిసెంబరు 9 న మేడ్చల్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తామని తెలిపారు. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు అందరం పాల్గొంటామని వివరించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. నవంబర్ 29 న నిమ్స్ ఆసుపత్రిలో కూడా కార్యక్రమాలు చేస్తాము…. కేసీఆర్ ఎక్కడా పాల్గొనరు..కానీ ఆయన స్ఫూర్తి తోనే దీక్ష దివస్ చేస్తామన్నారు.