బాలికల వసతి గృహంలో బాలికతో నగ్నపూజలకు యత్నం!

-

వసతి గృహంలో బాలికతో నగ్నపూజలకు యత్నం చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బాలికల వసతి గృహంలో బాలికతో నగ్నపూజలకు ప్రయత్నాలు చేశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

An incident of attempted nudity with a girl in a dormitory took place in Peddapally district

నగ్న పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని యువతికి మాయ మాటలు చెప్పిందట వసతి గృహంలో పనిచేసే వంట మనిషి. వసతి గృహంలో బాలికతో నగ్నపూజలకు వారం రోజుల కిందట ప్లాన్ చేశారట. దీంతో ఆ విద్యార్థిని భయంతో హాస్టల్ నుంచి పారిపోయింది.

తన కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి 4 రోజుల పాటు తల దాచుకుంది బాలిక. ఇక ఈ విషయం బయటపడటంతో రంగంలోకి పోలీసులు దిగారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news