రాజ్యాంగం ఎంత బలంగా ఉంటే దేశం అంత బలపడుతుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేసిన ఆయన..ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. న్యాయం, హక్కులు అందరికీ సమానంగా ఉండాలన్నదే మన రాజ్యాంగం ప్రాథమిక స్ఫూర్తి అని, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించాలని చెప్పారు.
సమాజంలోని పేద, అత్యంత బలహీన వర్గాలను రక్షించడానికి రాజ్యాంగం ఒక శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. అది ఎంత బలంగా ఉంటే మన దేశం అంత బలపడుతుందన్నారు. ఈ రోజున రాజ్యాంగ భావనను పరిరక్షించిన యోధులు, అమరవీరులు, రాజ్యాంగ పరిషత్‌లోని ప్రతి సభ్యునికి నివాళులు అర్పించారు.దానిని పరిరక్షించాలనే నా సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నానని ‘ఎక్స్’ వేదికగా రాసుకొచ్చారు.