రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలో తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. వాంకిడి, మాగనూరులో వారంలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ అయితే అధికారులు నిద్రపోతున్నారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? అని న్యాయస్థానం ఫైర్ అయ్యింది. అధికారుల నిర్లక్ష్యాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందే అని కోర్టు అభిప్రాయపడింది.
హైకోర్టు ప్రశ్నలపై స్పందించిన ప్రభుత్వ తరపు న్యాయవాది.. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. వివరాల సేకరణకు వారం రోజులు ఎందుకని మరోసారి హైకోర్టు మండిపడింది. ఆదేశాలు ఇస్తే కానీ అధికారులకు పనిచేయడం చేతకాదా? అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా,ఫుడ్ పాయిజన్ ఘటనలో ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.