ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఎంపికపై టీపీసీసీ చీఫ్ కసరత్తు..

-

తెలంగాణలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక, నామినెటెడ్ ఖాళీల భర్తీ, పార్టీ సంస్థాగత నిర్మాణ అంశాలపై పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్‌లో గురువారం కీలక సమావేశం నిర్వహించారు. శాసనమండలిలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు టి.జీవన్ రెడ్డి (కాంగ్రెస్), ఇదే జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిల పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనున్నది.

ఈ తేదీ నాటికి వీరి స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీల ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది.ఇందుకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను డిసెంబర్ 30న ఎన్నికల సంఘం ప్రకటించనుంది.కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మెదక్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మంత్రులు, ఇంచార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొండ సురేఖలు సమావేశానికి హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news